calender_icon.png 5 December, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయా నాటకమే తెలంగాణ రైజింగ్

05-12-2025 12:37:53 AM

  1. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే..
  2.   7న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
  3. బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ 

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైజింగ్ తెలంగాణ’ పేరిట నడుపుతున్నది అంతా నాటకమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో  తెలంగాణను దివాలా పరిస్థితికి నెట్టేసిందని, రూ.2 లక్షల కోట్లకు పైగా కొత్త అప్పులు తెచ్చారని మండిపడ్డారు. గురువారం ఆయ న  మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలను దాచిపెట్టేందుకు సీఎం  రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ “రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌”తో కొత్త నాటకం ఆడుతోం ద న్నారు.

ప్రచార ఆర్భాటాలు మాత్రమేనని, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. రేవంత్ ప్రభుత్వంలో రైజింగ్ అంటే అప్పు తీసుకునే దురాశ, ప్రచారం కోసం ఖర్చుచేసే పిచ్చి మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపుల్లేవు, ప్రాజెక్టులు మధ్య లో ఆగిపోయాయి, రాష్ర్ట ప్రభుత్వం మాత్రం అప్పు లు, పాలసీ గందరగోళం, అవినీతిని ప్రోత్సహించడమేనని విమర్శించారు.

ఉద్యోగులకు సకాలంలో జీతా లు ఇవ్వడం లేదు, విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సి న బెనిపిట్స్ ఇవ్వడం లేదు, ప్రజలకిచ్చిన ను నేరవేర్చడం లేదన్నారు. కానీ రైజింగ్ పేరుతో ఈవెంట్లు నిర్వహిం చి, ప్రజాధనాన్ని బహిరంగం గా దుర్వినియోగం చేయడమేనని ఆయన విమర్శించారు.  రాష్ట్రానికి పెట్టుబడుల విషయంలో బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ, గ్లోబల్ ఇన్వెస్టర్లు  స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ ఉన్న రాష్ట్రాల వైపే చూస్తారని సుభాష్ తెలి పారు.

కానీ ఇక్కడ భూములను అమ్మకం, అప్పులు, నెలకోసారి పాలసీలు మార్చడం వంటివే కనిపిస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 7న బీజేపీ ఆధ్వర్యంలో ‘గల్లంతైన గ్యారంటీలు  నెరవేరని వాగ్దానా లు, ప్రజావంచనకు రెండేళ్లు’ అనే నినాదంతో ఇందిరాపార్కులో మహాధర్నాను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.