13 June, 2026 | 4:34 PM

ప్లాన్ ప్రకారమే ఒగ్గు కళాకారుడు సాయి హత్య

10-06-2026 12:47 AM
  1. హత్య కేసులో నిందితుల గుర్తింపు?
  2. హత్యకు గల కారణాలపై అనుమానాలు

నల్లగొండ క్రైం, జూన్ 9: నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ ప్రాంతంలోని మేదర్ బజారుకు చెందిన బోదు సాయికుమార్(25) ను సోమవారం రాత్రి హత్య చేసిన విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మిర్యాలగూడ రోడ్డులోని హ్యాపీ హోమ్స్ సమీపంలోని వెంచర్ లో తీసుకెళ్లి ప్లాన్ ప్రకారమే సాయి తలపై బండరాయి వేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. సీఐ రాఘవరావు, తిప్పర్తి ఎస్‌ఐ శంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.

ఘటన స్థలంలో క్లూస్ టీం,డాగ్స్ తో తనికీలతో కీలక ఆధారాలు సేకరించారు. తిప్పర్తి ఎస్‌ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు సాయి ఇతరులకు డబ్బులు ఇచ్చి తిరిగి డబ్బులు ఇవ్వాలని అడగడంతో హత్యకు దారితీసిందా! మృతున్ని డబ్బులు ఇవ్వాలని అడగడంతో లేవని చెప్పడం వల్ల హత్య జరిగిందా! ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయి ఒగ్గు కళాకారుడు కావడంతో చాలా గ్రామాల్లో పండుగలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడని .

ఉత్తరప్రదేశ్ కు చెందిన కొందరు వ్యక్తులు గొల్లగూడ ప్రాంతంలో ఉంటూ చీరల వ్యాపారం చేస్తున్నారు. ఒగ్గు కళాకారులుగా సాయి చీరలు ధరించి పండగలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ చెందిన చీరల వ్యాపారంతో సన్నిహిత సంబంధం పెరిగిందన్నారు. ముగ్గురు వ్యక్తులు కలిసి మద్యం సీసా కొనుగోలు చేసి సాయిని తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాలో గుర్తించామని . నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాపీ ఆ తర్వాత బండరాయితో బలంగా తలపై కొట్టడంతో తల పూర్తిగా గుర్తు పట్టకుండా చిత్రమైందని,.

మృతుని వద్ద ఉన్న ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి, సెల్ టవర్ లోకేషన్, కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఒగ్గు కళాకారుడు సాయికి ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోవడంతో. అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని కీలక ఆధారాలు సేకరించామని త్వరలో నిందితులను పట్టుకుంటామని తిప్పర్తి ఎస్సై తెలిపారు.