22 March, 2026 | 8:43 PM

అయ్యో పాక్.. ఊహించని షాక్

26-08-2024 12:30 AM
  1. తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఘనవిజయం 
  2. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి

రావల్పిండి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలిటెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆతిథ్య పాకిస్తాన్‌కు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇంత వరకు బంగ్లా మీద టెస్టుల్లో ఓటమే ఎరుగని పాకిస్తాన్‌కు షాంటో సేన తొలి టెస్టు ఓటమిని రుచి చూపించింది. అంతే కాకుండా పాకిస్తాన్ గడ్డ మీద పాక్‌ను ఓ టెస్టులో 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగానూ రికార్డు నెలకొల్పింది. మొదటి నాలుగు రోజుల వరకు ఈ టెస్టు డ్రాగానే ముగుస్తుందని అనుకున్న అభిమానులకు ఐదో రోజు ఊహించని మలుపులు ఎదురయ్యాయి. దీంతో డ్రాగా ముగియాల్సిన మొదటి టెస్టు కాస్త బంగ్లాదేశ్ తన ఖాతాలో వేసుకుంది.

23/1తో ఐదో రోజు ఆటను ఆరంభించిన పాకిస్తాన్ 146 (55.5 ఓవర్లు) పరుగులకే ఎవరూ ఊహించని విధంగా చాపచుట్టేసింది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 448/6 (డిక్లేర్) చేయగా.. బంగ్లా మాత్రం 565 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి పాకిస్తాన్ కేవలం 594 పరుగులు మాత్రమే చేయడంతో మొదటి ఇన్నింగ్సులోనే 565 పరుగులు చేసి బంగ్లాకు విజయానికి కేవలం 30 పరుగులు మాత్రమే అవసరం అయ్యా యి. 30 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటిం గ్ మొదలు పెట్టిన బంగ్లాదేశ్ కేవలం 6.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడంలో రహీమ్ (191), షాద్మాన్ ఇస్లాం (93)తో సహా మిగతా బ్యాటర్లు తలో చేయివేశారు.

ఇక పాక్ మొదటి ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ (141), రిజ్వాన్ (171) శతకాలతో రాణించారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్‌లో మిరాజ్ 4, షకీబ్ మూడు వికెట్లతో పాక్ నడ్డి విరిచారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లా 1 తేడాతో ముందంజ వేసింది. అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన సీనియర్ బ్యాటర్ రహీమ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.  ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు ఆగస్టు 30 నుంచి రావల్పిండిలోనే మొదలు కానుంది.

దెబ్బకు దడేల్‌మని పడ్డారు

తొలి టెస్టులో బంగ్లాదేశ్ చేతిలో పది వికె ట్ల తేడాతో ఓడిపోవడంతో 2023 డ బ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ర్యాంకు ఘోరంగా పడిపోయింది. పాకిస్తాన్ ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. చిరస్మరణీయ విజయం సొంతం చేసుకున్న బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ పాయిం ట్ల పట్టిక ఆధారంగానే 2025లో జరిగే టెస్టు చాంపియన్‌షిప్‌కు ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు. 

మసూద్ నువ్వో స్వార్థపరుడివి

పసికూన బంగ్లా మీద తొలి టెస్టులో ఓడిపోవడంతో పాక్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ మీద నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. మహ్మద్ రిజ్వాన్ (171*) డబుల్ సెం చరీకి చేరువలో ఉన్న సమయంలో పాక్ కెప్టెన్ తొలి ఇన్నింగ్స్‌ను 448 వద్ద డిక్లేర్ చేశాడు. కానీ బంగ్లా మా త్రం తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగు లు చేసింది. మసూద్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి ఉండకపోతే బంగ్లాకు తొ లి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించి ఉండేది కాదని.. ఇంత ఘోరంగా పాక్ ఓడిపోయేది కాదని ఫైర్ అవుతున్నారు.