బీసీసీఐ సెక్రటరీగా రోహన్ జైట్లీ!
27-08-2024 12:00 AM
న్యూఢిల్లీ: బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా రోహన్ జైట్లీ ఎంపికయ్యే అవకాశాలు మెరు గ్గా ఉన్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న జై షా త్వరలో ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యే చా న్స్ ఉంది. ఈ నేపథ్యంలో జై షా ఐసీసీకి వెళ్తే ప్రస్తుత ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న రోహన్ జైట్లీ బీసీసీఐ సెక్రటరీగా పగ్గాలు చేపట్టే అవకాశముంది. కాగా నేటితో ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్ల గడువు ముగియనుంది. అయితే జై షా ఐసీసీ చైర్మ న్ పదవికి నామినేషన్ దాఖలు చేశాడా లే దా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపై దేశవాలీ మహిళల క్రికెట్‌తో పాటు అన్ని జూనియర్ క్రికెట్ టోర్నమెంట్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను ఇవ్వనున్నట్లు జై షా వెల్లడించాడు.




