ఆయిల్ పామ్ సాగు రైతులకు ఎంతో మేలు
నిర్మల్ జులై 20 ( విజయక్రాంతి) ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆయిల్ ఫామ్ పంటలు సాగు చేసుకుని లాభాలు పొందాలని రాష్ట్ర ఉద్యాన శాఖ రిటైర్డ్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రసేన రెడ్డి అన్నారు. సోమవారం సోన్ మండలంలోని బాపట్ల గ్రామంలో ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించారు. ఆయిల్ ఫాం సాగు పై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత మార్కెట్లో ఆయిల్ ఫామ్ బాగా డిమాండ్ ఉందని ఈ పంట సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని తెలిపారు.
పంట సాగుచేస రైతులకు ప్రభుత్వం అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎసి చైర్మన్ ధర్మాజీ రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మురళీధర్ రెడ్డి రమణారెడ్డి వెంకట్రామిరెడ్డి గంగారెడ్డి పోలాస మల్లేష్ ఉద్యానవన శాఖ అధికారి మౌనిక తదితరులు ఉన్నారు.






