calender_icon.png 18 June, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్యాంకర్ నుంచి ఆయిల్ చోరీ

09-08-2024 12:05:00 AM

డ్రైవర్ అరెస్టు

ఘట్‌కేసర్, ఆగస్టు 8: ఆయిల్ ట్యాంకర్ నుంచి ఏటీఎఫ్ ఆయిల్‌ను చోరీ చేస్తున్న ఓ ట్యాంకర్ డ్రైవర్‌ను యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఘట్ కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు.. ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి అంకుషాపూర్ లోని హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు ఆయిల్ ట్యాంకర్‌లో విమానాలకు వాడే ఏటీఎఫ్ ఆయిల్‌ను మహబూబ్ నగర్ జిల్లా దిల్‌వార్‌ఖాన్‌పల్లికి చెందిన బావాజీ సైదులు(33) తరలిస్తున్నాడు.

అయితే కంపెనీ సమీపంలో రోడ్డు పక్కన ట్యాంకర్ ఆపి అందులోని ఏటీఎఫ్ ఆయిల్‌ను పైపు ద్వారా చోరీ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని విచారించగా 15 లీటర్ల ఆయిల్‌ను పైపు ద్వారా తీసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏటీఎఫ్ ఆయిల్, పైపు, ఐరన్ రాడ్‌ను స్వాధీనం చేసుకుని ఆయిల్ ట్యాంకర్‌ను సీజ్ చేశారు.