6 July, 2026 | 2:02 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

ఆదిలాబాద్ విమానాశ్రయానికి ఓకే..

03-04-2025 01:40 AM
  • ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్ సెంటర్ ఏర్పాటు: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
  • ప్రధాని మోదీకి మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు 

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతిస్తూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలంగాణ ప్రభుత్వానికి సమాచారమందించింది. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం ఆర్‌అం డ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు లేఖ రాయగా బుధవారం అక్కడి నుంచి సమాధానం వచ్చింది.

ఆదిలాబాద్‌లో పౌరవిమా నాశ్రయానికి అనుమతి నేపథ్యంలో అక్కడ భవిష్యత్తులో ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్ సెం టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ సనప్ బాజీరావు రామ్‌నాథ్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయానం, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జా యింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. 

మరోవైపు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ జి ల్లా ప్రజలతో పాటు, రాష్ట్ర ప్రజలకు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శు భాకాంక్షలు తెలిపారు. అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.