16 July, 2026 | 10:06 AM

60 రోజులు.. 30,000 కి.మీ.

21-06-2024 01:29 AM

55 ఏళ్ల బైకర్ అరుదైన ఫీట్

గల్ఫ్ దేశాలన్నింటినీ చుట్టివచ్చిన వృద్ధుడు

మాదక ద్రవ్యాలు తీసుకోవద్దని యువతకు సందేశం

బెంగళూరు, జూన్ 20: కర్ణాటకమంగళూరుకు చెందిన 55 ఏళ్ల వృద్ధుడు శరత్ షిరి అరుదైన ఫీట్‌ను సాధించాడు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలనే సందేశంతో బైక్‌పై గల్ఫ్ దేశాలకు బయల్దేరాడు. 60 రోజుల్లో ఏకంగా 30 వేల కిలోమీటర్ల ప్రయాణించాడు. స్వస్థలమైన మంగళూరు నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి గోవా, ముంబై మీదుగా తన సవారీ గల్ఫ్ దేశాలకు పయనమయ్యాడు. ఇలా మస్కట్, దుబాయ్, సౌదీఅరేబియా, కువైట్, ఖతర్, ఒమన్, టర్కీ చుట్టి తిరిగి తాజాగా మంగళూరుకు చేరుకున్నాడు. బైక్‌పై జాతీయ జెండాకు తుళునాడు జెండాను సైతం జత చేసి మంగళూరుపై తనకున్న ప్రేమను చాటుకు న్నాడు. ఈ ప్రయాణంలో తన అనుభవాలను మంగళూరువాసులతో పంచుకుంటూ ఇప్పుడు సొంత నగరంలో సందడి చేస్తున్నాడు.