15 July, 2026 | 3:25 PM

Breaking News

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం   •   భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు   •   భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే   •   సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్   •   ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •   లక్ట్రికల్ వర్కర్స్ సంఘ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి   •  

కేటుగాళ్ల చేతిలో పాత ఫోన్లు.. 4వేల ఫోన్లతో సైబర్ నేరాలు

22-08-2024 11:31 AM

గోదావరిఖని:సైబర్ నేరాలకు పాల్పడే వారి కోసం పాత  సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న ముగ్గురిని పెద్దపల్లి జిల్లా రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 4వేల ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనులను స్వాధీనం చేసుకున్నారు. రామగుండం సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీఐ కృష్ణ మూర్తి తెలిసిన వివరాలివీ.. బిహార్ కు చెందిన కొంత మంది వ్యక్తులు ఎన్టీపీసీ మేడిపల్లి ప్రాంతంలో పాత ఫోన్లను తక్కువ ధరకు కొంటున్నారు. వాటికి బదులు ప్లాస్టిక్ వస్తువులు లేదంటే డబ్బులు ఇస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో కు అందిన సమాచారం మేరకు అనుమానాస్సదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసున్నామని తెలిపారు. విచారణలో భాగంగా వారు హతియా దియారా ప్రాంతానికి చెందిన మహమద్ షమీమ్(30), అబ్దుల్ సలాం (28) మహమద్ ఇఫ్తెకార్(32)లుగా గుర్తించారు. రామగుండం చుట్టు పక్కల ప్రాంతాలలో నెల రోజులనుంచి  వారు పాత ఫోన్లు కొని తుక్కు దుకాణం యజమాని అక్తర్ అలీకి పంపిస్తున్నారు. అతడు సైబర్ నేరగాళ్ల కు విక్రయించగా వాటిని మరమ్మతు చేసుకుని వినియోగించుకుంటున్నారని సీఐ తెలిపారు. అక్తర్ అలీ పరారీలో ఉన్నాడని తెలిపారు. పాత ఫోన్లను విక్రయించవద్దని ాయన ప్రజలకు సూచించారు.