15 July, 2026 | 3:32 PM

Breaking News

దేశంలో విద్యా విధానాన్ని కేంద్రం వ్యాపారంగా మార్చింది: మహేశ్ గౌడ్   •   మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జగ్గారెడ్డి భేటీ.. తుంగతుర్తి అంశాలపై చర్చ!   •   నాటు సారా పట్టివేత... ఒకరి అరెస్ట్   •   మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వండి   •   బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం   •   భవిష్యత్తులో ఏఐ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు   •   భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే ‘భూభారతి’ రీ సర్వే   •   సీఎం ప్రోగ్రాం బాయ్ కోట్   •   ఆర్‌ఎంపీ & పీఎంపీ వైద్యుల సమస్యల పరిష్కారమే లక్ష్యం   •   సోనాల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించండి.. కలెక్టర్ ను కోరిన సర్పంచ్   •  

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన.. ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

22-08-2024 11:24 AM

హైదరాబాద్‌: అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తోంది. అదానీ వ్యవహారంపై ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. సెబీ ఛైర్మన్ మాధబీ పురీ బచ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నిరసనకు దిగింది. సెబీ నిబంధనలు ఉల్లంఘించినట్లు మాధబీ పురి బచ్ పై ఆరోపణలున్నాయి. అదానీపై హిండెన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాలు, యూటీల్లోని ఈడీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ నిరసన చేస్తోంది. గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొంటారని కాంగ్రెస్ వెల్లడించింది. ఈడీ కార్యాలయం వద్ద సీఎంతో సహా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు.