29 July, 2026 | 6:13 AM

ఆటో బోల్తా పడి వృద్ధురాలి మృతి

30-05-2024 12:04 AM

హనుమకొండ, మే 29 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడి వృద్ధురాలు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన కల్గూరి రాణి, ఆమె తల్లి లక్ష్మి (68), మరో నలుగురు కలిసి మంగళవారం రాత్రి ఆటో లో మేడారం వనదేవతల దర్శనానికి బయలుదేరారు. బుధవారం ఉదయం 5 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి దామెర మండలం ఊరుగొండ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  . మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.