ఓటు వేసిన శతాధిక వృద్ధురాలు
14-05-2024 01:58 AM
జగిత్యాల, మే 13 (విజయ క్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఓ శతాధిక వృద్ధురాలు ఓటు వేసి నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. గ్రామానికి చెందిన హోటల్ గంగమ్మ (108) సోమవారం పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశారు. గంగమ్మకు ఎనిమిది మంది సంతానం. ప్రస్తుతం మనవలు, మనవరాళ్లతో ఉమ్మడి కుటుంబంలో నివసిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. యువతకు గంగమ్మ ఆదర్శమని గ్రామస్థులు కొనియాడారు.




