7 April, 2026 | 10:56 PM

ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనే

14-05-2024 01:55 AM

సీఎం కొడంగల్ ప్రెస్‌మీట్‌పై సీఈవోకు బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్ర టరీ బంగారు శ్రుతి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారని, ఇది ప్రధాన చానళ్లలో ప్రసారమైందని తెలిపారు. 

సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ‘ప్రజలు బీజేపీకి ఓటు వేయద్దని నిర్ణయించుకున్నారు. మహబూబ్‌నగర్‌లోని ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటువేయాలి. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించడం ఒక కల. మోదీ, ఈడీ కాంబినేషన్ తెలంగాణలో పనిచేయదు. బీజేపీ గ్రాఫ్ భారీగా తగ్గింది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. రేవంత్ మాటలను సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.