16 July, 2026 | 3:39 AM

బాలరాజ్‌కు ఒలింపిక్ టికెట్

22-04-2024 01:20 AM

న్యూఢిల్లీ:  భారత రోవర్ బాలరాజ్ పన్వర్ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. తద్వారా పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన తొలి భారత రోవర్‌గా నిలిచాడు. ఆదివారం దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ ఏషియన్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలువడం ద్వారా బాలరాజ్ ఈ ఘనత సాధించాడు. ఒలింపిక్స్‌లో బాలరాజ్ పురుషుల సింగిల్స్ స్కల్ విభాగంలో బరిలోకి దిగనున్నాడు. ఆసియా క్రీడల్లో తృటిలో పతకం చేజార్చుకున్న 25 ఏండ్ల బాలరాజ్.. తాజా పోటీల్లో 2000 మీటర్ల రేస్‌లో 7:01 నిమిషాల్లో పూర్తి చేసి పారిస్ కోటా పట్టేశాడు. ఈ పోటీల్లో టాప్ రోవర్లకు ఒలింపిక్స్‌కు అవకాశం దక్కనుండగా.. బాలరాజ్ మూడో ప్లేస్‌తో ఆకట్టుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో లైట్‌వైట్ డబుల్ స్కల్స్ విభాగంలో అర్జున్ లాల్ సింగ్ ద్వయం 11వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.