13 July, 2026 | 9:40 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

జింబాబ్వేకు ఒమన్ షాక్

06-02-2026 01:58 AM

నవీ ముంబై, ఫిబ్రవరి 5 : టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఒమన్ జట్టు అదరగొట్టింజి. ఇటీవల శ్రీలంక-‘ఎ’ జట్టును చిత్తు చేసిన ఒమన్.. తాజాగా జింబాబ్వేకు షాకిచ్చింది. ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వేపై సంచలన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్లలో బ్రియాన్ బెనెట్ (56) బ్రెండన్ టేలర్ (26) రాణించారు.

డియాన్ మేయర్స్ 26 పరుగులు చేయగా..లోయర్ ఆర్డర్లో తషింగ ముసేకివా మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 28 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని మెరుపులతోనే జింబాబ్వే స్కోరు 150 దాటగలిగింది.   ఒమన్ బౌలర్లలో సూఫియాన్ మెహమూద్ మూడు వికెట్లు తీయగా.. నదీం ఖాన్ రెండు, షా ఫైజల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్ మరో 4 బంతులు మిగిలుండగానే అందుకుంది. 

ఓపెనర్లలో ఆమిర్ కలీమ్ 23 పరుగులకు ఔటవగా... జతిందర్ సింగ్ హాఫ్ సెంచరీ చేసి రిటైర్డ్ అవుట్ అయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో హమాద్ మీర్జా (35), జితేన్ రామనంది (18 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్  బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు.  చివరికి 6 వికెట్లు చేజార్చుకున్న ఒమన్ జింబాబ్వేపై విజయం సాధించింది. ఒకవిధంగా జింబాబ్వేకు ఇది అవమానకరమైన ఓటమిగానే చెప్పాలి. ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్లో జింబాబ్వే 12వ స్థానంలో ఉండగా.. ఒమన్ది 20వ ర్యాంకు. కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది.