13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

పాక్‌తో ఆడేందుకు మేం సిద్ధం

06-02-2026 01:57 AM

కొలంబొ వెళ్తున్నాం: సూర్యకుమార్ యాదవ్

టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఇంకా కొద్ది గంటల్లో తెరలేవబోతోంది. కానీ ఈ సారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్  కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణం గా ఉండే క్రేజ్ కంటే కూడా భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేదే ఉత్కంఠ రేపుతోంది. నిజం చెప్పాలంటే  పాకిస్థాన్‌తో క్రికెట్ బోర్డు వైఖరి కారణంగా బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లు తలపట్టుకుంటున్నారు. ఫిబ్రవరి 15న భారత్ తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాక్ ప్రకటించింది.

పాక్ ప్రభుత్వం ఆదేశాలతో భారత్ మ్యాచ్ ఆడేది లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ అంశంపై స్పందించాడు. మెగాటోర్నీకి ముందు జరిగి కెప్టెన్ల మీడియా సమావేశంలో సూర్య దీనిపై మా ట్లాడాడు. షెడ్యూల్ ప్రకారమే తాము కొలంబోకు వెళుతున్నట్టు స్పష్టం చేశాడు. ఈ విషయంలో తాము పూర్తి క్లారిటీతో ఉన్నామని చెప్పేశాడు. పాక్ తో మ్యాచ్ ఆడమని తాము ఎక్కడా చెప్పలేదని, వాళ్లే ఆడేది లేదంటున్నారని గుర్తు చేశాడు.

ఐసీసీ ప్రో టోకాల్‌కు అనుగుణంగా తాము మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. మొదట యూఎస్‌ఏతో, తర్వాత నమీబియా తో మ్యాచ్‌లు ఆడి కొలంబోకు బయలుదేరనున్నట్టు తేల్చేశాడు. ఇప్పటికే ఫ్లైట్ కూడా బుక్ అయిందని సూర్యకుమార్ వెల్లడించాడు. ఈ విషయంలో తమకు ఎలాంటి గందరగోళం లేదని సూర్యకుమార్ కుండబద్దలు కొట్టాడు. వాళ్ల నిర్ణయం తన ఆధీ నంలో ఉండదని, గతంలో ఆసియాకప్ వేదికగా మూడు మ్యాచ్‌లు ఆడిన విషయాన్ని సూర్యకుమార్ గుర్తు చేశాడు.

ఇదిలా ఉంటే పాక్ జట్టు వెనక్కి తగ్గుతుందేమో అనుకుంటున్న వేళ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని ప్రకటించారు. బంగ్లాదేశ్ కు మద్ధతు గా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందం టూ విమర్శించారు. ఇదిలా ఉంటే టీ20 ప్ర పంచకప్ కోసం పాక్ జట్టు ఇప్పటికే కొలం బో చేరుకుంది. భారత్‌తో మ్యాచ్ తప్ప మిగిలిన మ్యాచ్ లు ఆడాలని నిర్ణయించుకుంది.