21 March, 2026 | 4:22 AM

వంద శాతం పన్నులు చెల్లించాలి

21-03-2026 12:57 AM

చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి 

శామీర్ పేట్, మార్చ్ 20 (విజయక్రాంతి): మున్సిపాలిటీ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కౌన్సిలర్ లు సహకరించాలని చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం అలియాబాద్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అధ్యక్షతన కౌన్సిలర్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 20 వార్డు లకు గాను ప్రతి వార్డుకు రూ. 5 లక్షల చొప్పున  పలు అభివృధి పనులకు తీర్మానం చేశారు.

ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ... మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు అందరూ పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. విడతల వారీగా మున్సిపాలిటీలో పలు సమస్యలను పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు ఇంటి పన్ను,అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజులను 100 శాతం  అధికారులు వసూలు చేసి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ చంద్రశేఖర్, వైస్ చైర్ పర్సన్ మాలతి రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.