రంజాన్ ప్రార్థనలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ
కోదాడ, మార్చి 20 : పట్టణ పరిధిలోని సాలర్జంగ్ పేటలో గల ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనలకు కోదాడ మునిసిపల్ పాలక వర్గం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మునిసిపల్ చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం ఈద్గా వద్ద ముస్లింల ప్రార్థనలకు మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యం లో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
వేసవి తీవ్రత కు టెంట్లు, మంచి నీరు,కూర్చునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లలనీ సూచించారు. ముస్లింలు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకోవాలన్నారు. ముందస్తుగా వారికి ఈద్ ముబారక్ తెలిపారు. ఈమె వెంట వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కమీషనర్ రమాదేవి,కౌన్సిలర్ లు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు, స్థానిక నాయకులు ఉన్నారు.




