జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు
21-03-2026 12:57 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, మార్చి 20 (విజయక్రాంతి): జిల్లా ప్రజలకు నేడు రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల (జకాత్) ద్వారా ఈ పవిత్ర మాసం సహనాన్ని, సేవాభావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు.
రంజాన్ పండుగ శాంతి, సౌహార్ద్రం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా, మత సామరస్యంతో ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం మరింత బలపడాలని, అందరికీ ఆరోగ్యం, సంతోషం కలగాలని పేర్కొన్నారు.




