12 March, 2026 | 10:30 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నూరుకు నూరు శాతం పదిలో ఉత్తీర్ణత సాధించాలి

08-11-2025 05:37 PM

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

భూత్పూర్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి విద్యార్థినిలకు సూచించారు. శనివారం భూత్పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. పదవ తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడి పాఠ్యాంశాల బోధన, ప్రత్యేక తరగతులు, మెనూ, మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా అడిగారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ రెగ్యులర్ గా పాఠశాలకు హాజరవుతూ సబ్జెక్టు విషయాల పట్ల ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉండాలని అన్నారు. పాఠశాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పారిశుద్ధ్యం, విద్యార్థినిల ఆరోగ్యం, భోజనం, తదితర అంశాల పట్ల ఏలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు. వంట శాలలో విద్యార్థినులకు వండిన ఆహారంను పరిశీలించారు. విద్యార్థి నిలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ కిషన్ తదితరులు ఉన్నారు.