08-11-2025 05:35:04 PM
భైంసా (విజయక్రాంతి): లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామంలో దుర్గామాత ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని నిర్మించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కనకాపూర్ గ్రామంలో కనకదుర్గమ్మ ఆశీస్సులతోనే అభివృద్ధి చెందిందని ఈ గ్రామస్తుల విశ్వాసంతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.