calender_icon.png 2 August, 2025 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

24-10-2024 04:45:11 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపాన ద్విచక్ర వాహనం ఢీ కొనగా ఒకరికీ  తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌక్ వైపుపై నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా ఢీకొట్టాడు. దీంతో కింద పడిపోయిన అతని, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ప్రజలు గాయపడ్డ వ్యక్తిని మంంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపైన ఇష్టం వచ్చినట్టు వాహనాలు పెట్టడంతో నే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.