calender_icon.png 28 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష సభ్యత్వ నమోదుకు శ్రీకారం

27-11-2025 12:00:00 AM

ఖైరతాబాద్, నవంబర్ 26 (విజయ క్రాంతి) :  దినోత్సవం సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆథవాలే) లక్ష సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు తెలిపారు.బుధవారం హైదరాబాద్ సోమాజి గూడ ప్రెస్ క్లబ్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పిఐ) ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ... రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండి యా బలోపేతానికి అందరూ కృషిచేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు బరిలో నిలబడాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పిబిఆర్ గౌడ్ ను సన్మానించారు. సమావేశం లో రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు రవికుమార్. రత్న ప్రసాద్, గోరఖ్ సింగ్, స్నేహలత, పద్మ, రోజారాణి, మీడియా కోఆర్డినేటర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.