calender_icon.png 28 November, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బాస్’ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం

27-11-2025 12:00:00 AM

51 రోజులపాటు దాదాపు 500 మంది అయ్యప్ప స్వాములకు..

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): మాల ధారణ చేసిన అయ్యప్ప స్వాములకు 51 రోజులపాటు నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించడం అత్యంత గొప్ప విషయమని అఫ్జల్ గంజ్ సీఐ రవికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉస్మాన్ గంజ్‌లోని శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో బాస్ అధ్యక్షుడు మేడిశెట్టి రాకేష్, కార్యదర్శి భద్రేశ్వర్, కోశాధికారి సీఏ అనిల్, నాయర్ ల నేతృత్వంలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం, కార్యక్రమ పూజకు ఇన్‌స్పెక్టర్ రవికుమార్, ఎస్‌ఐ లక్ష్మణ్ హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు.

అనంతరం సిఐ రవికుమార్ మాట్లాడుతూ.. బాస్ గత కొన్ని సంవత్సరాలుగా, ఆకలితో అలమటిస్తున్న స్వాముల కడుపు, నింపడం గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన అనాధలను అక్కున చేర్చుకొని వారికి విద్యా వసతి తోపాటు గోశాలను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. కార్యక్రమంలో విజయ భాస్కర్, అన్నదాన కమిటీ ఇన్చార్జ్, ఏం జగదీష్, కో ఇన్చార్జులు, వై అశోక్, హరికృష్ణ, నర్సింగ్, కే రాజు, విజయేందర్‌రెడ్డి, నరేష్ పటేల్, ఏం శ్రీనివాస్ పాల్గొన్నారు.