ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
భీమిని, ఏప్రిల్ 24 : ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. శుక్ర వారం భీమిని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామస భకు అధికారులతో కలిసి హాజరై కలెక్టర్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్వారా గ్రామ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పరిపాలన సౌలభ్యం కొరకు గ్రామ సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జిల్లా పరిషత్ వ్యవస్థల ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.
క్షేత్రస్థా యిలో స్థానిక ప్రజా ప్రతినిధులకు సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, తద్వారా సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షే మ ఫలాలు అందుతా యన్నారు. ఉపాధి హామీ పథకం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వం పథకాలు విజయవంతం కావడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని సూచించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతలు హాజరుకావాలని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఆస్కా రం ఉంటుం దన్నారు.
అనంతరం కన్నెపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు, మందు ల నిల్వలు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. వేసవి అయినం దున వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సదుపా యాలు అందించాలని, వైద్యు లు, సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలన్నారు.






