సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
27-07-2026 02:20 AM
సీఐ వెంకటరెడ్డి
సిర్గాపూర్, జులై 26: సిర్గాపూర్, కంగ్టి, కల్హేర్ మండలాల్లోని ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకటరెడ్డి సూచించారు. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.






