14 August, 2026 | 2:59 AM

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

14-08-2026 12:24 AM
  • సీఐ వెంకటేశ్వర్లు

కందుకూరు, ఆగస్టు 13(విజయక్రాంతి): సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల పట్ల ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కందుకూరు సీఐ హెచ్. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ’ప్లాంట్ లిపిడ్స్’ పరిశ్రమలో సుమారు 200 మంది ఉద్యోగులకు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్లు, నకిలీ వీడియో కాల్స్ వంటి సైబర్ మోసాల బారిన పడకుండా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను గోప్యంగా ఉంచాలని సూచించారు. సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కి కాల్ చేయాలన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ వాడినా, విక్రయించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్ర మహేందర్, సీహెచ్ రాజు, నరేష్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.