ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి
14-08-2026 12:00 AM
బిక్కనూర్, ఆగస్టు 13(విజయ క్రాంతి): మండలంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్త్స్ర అనిల్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో బైకులు, ఆటోల్లో తిరిగే అపరిచిత వ్యక్తుల కదలికలను గమనించి అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
రైతులు రాత్రివేళ వ్యవసాయ బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, దొంగతనాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక నిఘా చేపడుతున్నారని తెలిపారు. గ్రామస్తులు సమన్వయంతో పోలీసులకు సహకరించాలని కోరారు.






