13 August, 2026 | 11:31 PM

క్రమశిక్షణను అలవర్చుకోవాలి

13-08-2026 10:06 PM

ములకలపల్లి,ఆగస్టు 13 (విజయక్రాంతి): విద్యార్థులు మంచి క్రమశిక్షణను అలవర్చుకొని ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలని  సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి అన్నారు.గురువారం ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ గుట్టగూడెం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బూట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలందరూ పరిశుభ్రంగా,క్రమశిక్షణతో పాఠశాలకు రావాలని చదువుతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు  తీసుకోవాలని సూచించారు.

ప్రధానోపాధ్యాయులు జి.బద్రు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం యూనిఫామ్,బూట్లు,పుస్తకాలు అందిస్తోందని దీనివల్ల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి.లక్ష్మణ్,ఎ శ్రీను,కె రాంబాబు,జి కృష్ణ,వాడే రామచంద్రం,పిల్లల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.