10 August, 2026 | 3:46 AM

‘పరిశ్రమ’కు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

10-08-2026 12:39 AM

మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ నర్సింహులు 

ఘట్ కేసర్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగిన నై పుణ్యాలను పెంపొందించుకోవాలని ఉ స్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీ రింగ్ మాజీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్  నర్సింహులు సాంకే అన్నారు. ఘనపూర్ లోని కేపిఆర్‌ఐటి  కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో  నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ప్రారంభ్2026 ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని  నిర్వహించా రు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పా ల్గొన్నారు.  ఈ కార్యక్రమానికి  ప్రొఫెసర్ న ర్సింహులు సాంకే, మైక్రోసాఫ్ట్ ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ మేనేజర్ రంజిత్ కు మార్ అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పా టు కేపిఆర్‌ఈఎస్ చైర్మన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రశాంత్, సెక్రటరీ రాకేష్, డైరెక్టర్ స్ట్రాటజీస్ కొమ్మూరి దివ్య శ్రీ, సీఈవో  ప్రొఫెసర్ సి.డి. నాయుడు, డైరెక్టర్ ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్, అడ్వైజర్ ప్రొఫెసర్ జివికె  రెడ్డి, కేపిఆర్‌ఐటిసిఓఈ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. శ్రీనాథ్ కశ్యప్ తదితరులు పాల్గొన్నారు.