18 May, 2026 | 3:29 AM

సత్ప్రవర్తన కలిగి ఉండాలి

18-05-2026 02:33 AM

మహబూబాబాద్, మే 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ నూతనంగా సీఐ గా బాధ్యతలు చేపట్టిన రఘుపతి రెడ్డి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్స్కు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. రౌడీ షీటర్స్ తమ పాత నేరప్రవర్తనలను పూర్తిగా విడనాడి, మంచి పౌరులుగా మారాలని సూచించారు. ఎవరైనా తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు భయాందోళనలు కలిగించే చర్యలు, గొడవలు, బెదిరింపులు, అక్రమ కార్యకలాపాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వ్యవహారాలలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. అలాగే యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు సహకరించాలని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ ఐ రాంచరణ్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.