మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవ ఎన్నిక
ఖమ్మం టౌన్, మే 17 (విజయ క్రాంతి): మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శీలంశెట్టి వీరభద్రం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతోపాటు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి దేవేంద్రం, కోశాధికారిగా మడూరి పూర్ణచంద్రరావు, గౌరవ అధ్యక్షుడిగా కొత్త సీతారాములు ఎన్నికయ్యారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఆకుల గాంధీ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి హాజరైన నాయకులంతా అధ్యక్షుడు ఎంపిక నిర్ణయాన్ని సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నిర్ణయానికి వదిలేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు. శీలంశెట్టి వీరభద్రం పేరు ఆయన ప్రకటించగా సభ్యులంతా హర్షద్వానాలతో అంగీకారం తెలిపారు.
అనంతరం మున్నూరు కాపు సంక్షేమ సంఘం అనుబంధ సంఘాలైన యువజన, మహిళా విభాగాలకు సైతం ఏకగ్రీవంగా కమిటీలను ఎన్నుకున్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా తోట రమేష్, ప్రధాన కార్యదర్శిగా మాటేటి కిరణ్ కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా పగడాల మంజుల, తోట సుజలా రాణి ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం ప్రముఖులు మేకల బిక్షమయ్య,ఆర్జెసి కృష్ణ, కనకం జనార్ధన్, పొదిల రవికుమార్, శెట్టి రంగారావు, లక్కినేని రఘు, గీతా వెంకన్న, పొన్నం వెంకటేశ్వర్లు, బచ్చు విజయ్ కుమార్, జాబిశెట్టి శ్రీనివాసరావు, వివిధ నియోజకవర్గాల బాధ్యులు ఆళ్ల కృష్ణ, మారిశెట్టి వెంకటేశ్వరరావు, తోట గణేష్, మాజీ కార్పొరేటర్లు తోట రామారావు, మాటి నాగేశ్వరరావు, తోట వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.






