18-08-2025 09:45:56 AM
అంబులెన్స్ లేక చనిపోయిన వ్యక్తిని తోపుడు బండిలో తరలించిన పోలీసులు
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజవర్గంలో ఇదీ దుస్థితి
నారాయణపేట (విజయక్రాంతి): కొడంగల్ - నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మొగులయ్య(28) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లేకపోవడంతో మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తోపుడు బండిపై మృతదేహాన్ని తరలించారు. సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచ్చిన ఓ చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అనుమతి లేకుండానే తీసుకొని పోలీసులు మృతదేహాన్ని తరలించడం చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు.