8 August, 2026 | 2:49 AM

సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి

08-08-2026 01:51 AM

ఎస్‌వీ వర్సిటీ మాజీ వీసీ దామోదరం

ఘట్ కేసర్, ఆగస్టు 7 (విజయక్రాంతి) : సాంకేతిక ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని  జేఎన్టీయూహెచ్ రెక్టార్, ఎస్.వి. యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ దామోదరం అన్నారు. ఘట్‌కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, ఘనపూర్‌లోని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కెపిఆర్‌ఐటి)లో శుక్రవారం నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సమారంభ్2026 ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దామోదరం, సింక్రోనీ సంస్థ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్నోవేషన్ స్టేషన్ లీడర్ ఈశ్వర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేపిఆర్‌ఈఎస్ చైర్మన్  ప్రతాప్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రశాంత్, సెక్రటరీ  రాకేష్, డైరెక్టర్ స్ట్రాటజీస్ దివ్య శ్రీ, సీఈఓ ప్రొఫెసర్ సి.డి. నాయుడు, డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్, అడ్వైజర్ జి.వి.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.