మీలో ఒకడు.. మీ సాగర్!
రామ్ పోతినేని మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మహేశ్‌బాబు పీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ సినిమా హీరోగా రామ్‌కు ఇరవై రెండోది. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే ఈ సినిమాలో రామ్ సాగర్ పాత్రలో నటిస్తున్నారు. మేకర్స్ శుక్రవారం ఆయన క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. ‘మీకు సుపరిచితుడు.. మీలో ఒకడు& మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు దర్శకుడు మహేశ్‌బాబు.
పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, ముఖంలో నవ్వుతో రామ్ క్యారెక్టర్ లుక్ ఆకట్టుకుంటోంది. రెగ్యులర్ షూటింగ్ కూడా శుక్రవారమే హైదరాబాద్‌లో మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు. రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా; ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్; సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్; సంగీతం: వివేక్ మెర్విన్.






