ప్రైవేట్ వీడియో లీక్
‘లగ్గం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ ప్రగ్యా నగ్రా. తమిళ చిత్రం ‘వరలరు ముఖ్యం’తో సినీ పరిశ్రమకు పరిచయమైన ప్రగ్య.. ఆ తరువాత మలయాళంలో ఓ చిత్రంలో నటించారు. ఆ తరువాత ‘లగ్గం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పేరు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం ఓ ప్రైవేట్ వీడియో ఆన్‌లైన్‌లో లీక్ అవడమే.
అది ఆమెదేనని కొందరు చెబుతు న్నారు. ఆ వీడియోలో ప్రగ్య.. ఓ వ్యక్తితో ఏకాంతంగా ఉన్నారు. ఆ వ్యక్తి ఆమె ప్రియుడేనని చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువైపోతున్నాయి. రష్మిక మందన్నాకు సంబంధించిన డీప్ ఫేక్ పిక్ కూడా బయటకు వచ్చింది. ఆ సమయంలో ఇండస్ట్రీ మొత్తం ఆమెకు అండగా నిలిచింది. ప్రస్తుతం ప్రగ్యా విషయంలోనూ అదే జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






