calender_icon.png 26 December, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు ఢీకొని ఒకరు మృతి

26-12-2025 12:06:14 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. సంఘటన వివరాలు ఇలావున్నాయి. బెల్లంపల్లి మండలం రవీంద్ర నగర్ కు చెందిన  సాయి కుమార్ (28) బైక్ పై వెళ్తుoడగాను అతివేగంగా వెనుక నుంచి కారు వచ్చి ఢీకొన్నది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడి సాయికుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బెల్లంపల్లి గవర్నమెంట్ ఆస్పత్రిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈమేరకు బెల్లంపల్లి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.