calender_icon.png 26 December, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాదాభిషేకం చేసినా.. తక్కువే

26-12-2025 01:33:55 PM

రేవంత్ రెడ్డి కిస్మత్ బాగుండి సీఎం అయ్యారు

హైదరాబాద్:  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో(BRS Party)  చేశారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలో చెక్ డ్యాములను పేలుస్తున్నారు. దుర్మార్గులు ఇసుక తోడుకునేందుకు చెక్ డ్యాములు పేలుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) చెక్ డ్యాములు నిర్మిస్తే.. వీల్లు బాంబులతో పేలుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో హామీలిచ్చిన రేవంత్ రెడ్డి అన్నీ ఎగవేశారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి(CMRevanth Reddy) కిస్మత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని విమర్శించారు. హామీల గురించి అడిగితే.. రేవంత్ రెడ్డి బూతులు తిడుతున్నారని కేటీఆర్ సూచించారు. తిట్ల భాష మాకు కూడా వచ్చు.. కానీ మేం తిట్టం అన్నారు. పెంచుతానన్న పింఛన్లు ఎప్పట్నుంచి ఇస్తారో సీఎం చెప్పాలి? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలకు నేను పాదాభిషేకం చేసిన.. తక్కువే అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరసగా రెండుసార్లు గెలిపించారని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయారని కేటీఆర్ వెల్లడించారు.