26-12-2025 12:35:21 PM
హైదరాబాద్: వరస సెలవులు రావడంతో తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వరస సెలవులు రావడంతో గుట్టకు భక్తుల తాకిడి పెరిగిందని అధికారులు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు శ్రీశైలం ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరిగింది. శుక్రవారం వేకువజాము నుంచే క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.