26-12-2025 12:23:57 PM
తిరుమల: శాస్త్రవిజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్(RSS chief Mohan Bhagwat) తెలిపారు. తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ పాల్గొని ప్రసంగించారు. సుఖం అనేది కేవలం మానసికపరమైనదని తెలిపారు. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలన్నారు. సుఖ దుఃఖాలు తాత్కాలికమైనవని సూచించారు. మనం పొందుతున్న వాటిలో రెండో కోణం కూడా ఉంటుందన్నారు. మనమంతా ఈ విశ్వానికి ఎంతో కొంత రుణపడి ఉన్నామని వెల్లడించారు. మానసికంగా సంతృప్తి లేకపోతే ఎంతపొందినా సుఖం కలగదని, క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని భాగవత్ పేర్కొన్నారు. కొందరిలో ఎంత ఎదిగిన అంత అహంకారం పెరుగుతోందని వివరించారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ తో కలిసి సమ్మేళనం ప్రారంభించారు.