17 May, 2026 | 10:50 AM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

20-06-2024 12:57 PM

ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి బస్టాండ్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. బొప్పాపూర్ గ్రామానికి చెందిన మహేశ్(45) బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఓ కంటైనర్ బైక్ ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మహేశ్ తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డు ప్రమాదానికి సంభదించిన సీసీ కెమెరా ఫుటేజ్ వైరల్ గా మారింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.