దొంగతనం నింద.. పోలీస్ స్టేషన్‌లోనే పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దొంగతనం నింద మోపడంతో మనస్థాపం చెంది ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొల్లాపూర్ పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మీ(28) అనే మహిళ పట్టణంలోని సాయి కృప ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. కాగా గతేడాది ఆ క్లినిక్ లో జరిగిన దొంగతనం కేసు విషయంలో పోలీసులు మళ్ళీ తనను స్టేషన్ కి పిలవడంతో మనస్థాపం చెంది పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అందరూ ఫీడ్స్ వచ్చి ఉంటుందని భావించి ఆసుపత్రికి తరలించే లోపు పరిస్థితి విషమించి మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై సీఐ మహేష్ వివరణ ఇస్తూ దొంగతనం కేసులో కేసు విచారణ జరుగుతోందని దానికి సంబంధించి ప్రస్తుతం తనపై ఎలాంటి ఒత్తిడి పెంచలేదన్నారు.






