12-12-2024 12:36:41 AM
కామారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి): చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. పట్టణంలోని కల్కినగర్ కాలనీకి చెందిన పాక ఆంజనేయులు (36) పెద్ద చెరువులో పడి మృతిచెందాడు. బుధవారం ఉదయం చెరువు లో మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకు ని వెలికి తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.