11-07-2025 01:34:32 PM
నూతనకల్,(విజయక్రాంతి): హిందూ ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే అత్యంత ప్రాధాన్యత ఉంటుందని బిజెపి అసెంబ్లీ కన్వీనర్(BJP Assembly Convener) కాప రవి కుమార్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయంలో గురు పూర్ణిమ పురస్కరించుకొని బిజెపి ఆధ్వర్యంలో గురువులను సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులు అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తారని అన్నారు అలాంటి గురువులను గౌరవించడం కనీస బాధ్యతని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు గిలకత్తుల రామస్వామి,బాణాల లింగారెడ్డి,సమాధి యాకా రెడ్డి, శ్రీరామ శర్మ,బిజెపి నాయకులు మద్ది సంజీవరెడ్డి,మధుసూదన్ రెడ్డి,వెంకట్ రెడ్డి,లక్ష్మయ్య, చంద్రయ్య,మల్లయ్య తదితరులు ఉన్నారు.