calender_icon.png 13 February, 2026 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరెంట్ షాక్‌తో ఒకరి మృతి

13-02-2026 12:00:00 AM

హోర్డింగ్‌ను ఏర్పాటు చేస్తుండగా హైటెన్షన్ తీగ తగలడంతో ప్రమాదం

బోయిన్‌పల్లిలో ఘటన

సికింద్రాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాం తి): కరెంట్ షాక్‌తో ఒకరు మృతిచెందిన ఘటన సికింద్రాబాద్ కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధి బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద గురువారం జరిగింది. నల్లకుంటకు చెందిన మహాం కాళి రవి(37) హోర్డింగ్‌లు బిగించే పనులు చేస్తుంటాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్ల లు ఉన్నారు. రవిని గురువారం రాజు అనే సూపర్‌వైజర్ పని ఉందని తీసుకెళ్లాడు.

బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ బ్రిడ్జి వద్ద బిల్డింగ్ పైనుంచి హోర్డింగ్‌ను ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు హైటెన్షన్ తీగ తగల డంతో రవి పైనుంచి కింద పడ్డాడు. మరో  వ్యక్తి అంబర్‌పేటకు చెందిన సోమన్న(47)కు గాయాలు అయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రవి మృతిచెందాడు.

పనిచేసే ప్రదేశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపించడం వలన తన భర్త రవి  చనిపోయాడని, ఇందుకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భార్య సునీత పోలీసులను అభ్యర్థించింది.  మృతుడి కుటుంబానికి నష్టపరిహారం  ఇవ్వాలని కోరుతూ కుటుంబసభ్యులు, బంధువులు  గాంధీ మార్చురీవద్ద ఆందోళన నిర్వహించా రు. కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.