21 July, 2026 | 11:57 AM

చికిత్స పొందుతూ ఒకరి మృతి

21-07-2026 01:17 AM

లక్షెట్టిపేట, జూలై 20 : లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లికి చెందిన రాందేని రాకేష్ (25) అనే వ్యక్తి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు ఎస్త్స్ర గోపతి సురేష్ తెలిపారు. ఎస్త్స్ర తెలిపిన వివరాల ప్రకారం, రాకేష్ గత ఏడాది క్రితం ఇదే ప్రాంతానికి చెందిన తన మేన మరదలు కావ్యతో వివాహమైందన్నారు. మృతునికి నిన్న ఉదయం ఇంట్లో తన భార్యతో చిన్న గొడవ జరగడంతో తన భార్య వాళ్ళ తండ్రిని పిలిపించుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందన్నారు.

భార్య చిన్నపాటి గొడవకే తండ్రిని పిలిపించుకొని వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాకేష్ ఇంట్లో ఉన్న పంటకు పిచికారీ చేసే గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రాకేష్ ను లక్షెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుని తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.