పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
దిశ కమిటీ చైర్‌పర్సన్, ఎంపీ డీకే అరుణ
అభివృద్ధి పనుల పురోగతి, పేదలపై సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ను నిజమైన అర్హులకు అందినప్పుడే ఆయా పథకాల లక్ష్యం నెరవేరుతుందని, అభివృద్ధి పనులు అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తేనే జిల్లా సమగ్ర అభివృద్ధి జరుగుతుందని దిశ కమిటీ చైర్‌పర్సన్, ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలోని ప్రజల పరిష్కారం చేస్తూ,మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అవసరాలు తెలుసుకొని వాటికి తగినట్లుగా అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా నిధుల సద్వినియోగమవుతాయన్నారు. మంగళవారం కలెక్టరే ట్‌లోని సమావేశం మందిరంలో జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం చైర్ పర్సన్, ఎంపీ డీకే అరుణ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలపై క్షేత్ర స్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఆయిల్ తోటల విస్తరణ, ఆర్గానిక్ ఫామింగ్ ద్వారా కూరగాయల ఉత్పత్తి, వరి, కందులు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ పై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.కూరగాయల పందిరి తోటలకు కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుందని దీనిని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. అంగన్‌వాడీ మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిగా కేంద్ర నిధులతో చేపడుతుందని అన్నారు.
జిల్లాలో ఉన్న మొత్తం 10,163 కేంద్రాల్లో పక్కా భవనాలు లేని 465 అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను మొదటి ప్రాధాన్యతలో మంజూరు చేసి, త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని అన్నారు. జిల్లాలో వివిధ రకాల పెన్ష న్ అప్లికేషన్ సుమారు 17వేలు పెండింగ్ లో ఉన్నాయని. అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటి మంజూరులో జరుగుతున్న జాప్యం ఎందుకని అధికారులను, ఎంపీ డీకే అరు ణ ప్రశ్నించారు. ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వలేదని.. వచ్చే విడతలో మంజూరు అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
స్వయం సహాయ క బృందాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అందిస్తున్న ప్రోత్సాహకాలు, రుణ సౌకర్యాల ద్వారా జరుగుతున్న లబ్ది గురించి ఆరా తీశారు. నిరుపేదలకు నిష్పక్షపాతంగా ఇండ్లు మంజూరు చేయా లని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పేదలకు పార్టీల ముద్ర వేయడం సరికాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అందిస్తున్న నిధులు అందుతున్న తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలకు అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో దిశ కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు,జిల్లా అధికార యంత్రాంగం, మహబూబ్‌నగర్ మేయర్ మమ త, కార్పొరేటర్లు కిరణ్ కుమార్‌రెడ్డి, జ్యోతి, బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్, కరుణాకర్ రె డ్డి , నవీన్ రెడ్డి,తిరుపతి, పాల్గొన్నారు.






