29 April, 2026 | 2:16 AM

కళా విహీనంగా పోచ్చెర జలపాతం

29-04-2026 12:16 AM

బోథ్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): వర్షాకాలంలో గలగల పారే వాగులు,  ఎండిపోవడంతో పోచ్చెర జలపాతం చుక్క నీరు లేక కళావిహీనంగా మారింది. వర్షాకాలం పర్యాటకులను ఆకట్టుకునే ఈ జలపాతం అందాలను చూసేందుకు ఇతర జిల్లాల నుండి పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. అయితే ఈ జలపాతానికి వచ్చే పెద్ద వాగు పూర్తిగా ఎండిపోవడంతో నీటి దారాలు నిలిచిపోయాయి. ఫలితంగా జలపాతం అందాలు కనుమరుగయ్యాయి. నీటిని నిలువ చేసేందుకు చెక్ డ్యాములు వాగుపై నిర్మించిన ఫలితం లేకుండా పోయింది.