అన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉండాలి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ అర్బన్ ఆగస్టు 10 (విజయక్రాంతి): అన్ని రంగాల్లో ప్రావీణ్యత ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాంస్కృతిక సేన ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన అంబేద్కర్ కళాభవన్లో నిర్వహించనున్న ఓపెన్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెస్ వంటి మేధస్సును పెంపొందించే క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యువతలో ఆలోచనా శక్తి, ఏకాగ్రత పెంపొందిం చడంలో ఇటువంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక సేన అధ్యక్షులు టంకర శ్రీనివాస్, డిసిసి ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, టంకర కృష్ణయ్య యాదవ్, రాజు, కేశవులు, ఆనంద్ బాబు, శేఖర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.






