5 June, 2026 | 1:49 AM

జీలుగు విత్తనాలు వినియోగించుకోవాలి

05-06-2026 12:38 AM

పీఏసీఎస్ చైర్మన్ సైదులు

తుంగతుర్తి, జూన్ 4: రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. గురువారం మండల కేంద్రంలోనిది రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేసి మాట్లాడారు. 30 కేజీల బస్తా రూ.4,950 ఉండగా 50 శాతం సబ్సిడీతో రూ.2,453కు అందిస్తున్నట్లు తెలిపారు.

కావాల్సిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ను తీసుకురావాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ రమేష్ బాబు సొసైటీ సీఈవో శేర్ల యాదగిరి, రైతులు మాధవరావు, దేవేందర్ రావు, కాసం మల్లయ్య, యూసుబ్, బిక్షం, లింగయ్య, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.